యెవ్వనియందు డిందు బరమేశ్వరుడెవ్వడు, మూలకారణం
బెవ్వ, డనాదిమధ్యలయు డెవ్వడు, సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
గజరాజు నోటి నుండి పోతన్న పలికించిన పద్యం.
సి.నారాయణ రెడ్డిగారి వ్యాఖ్యానం:
సర్వేశ్వరుని మూలతత్త్వం ఈ పద్యంలో ఎన్నో దళాలతో విప్పారింది. ఇందులోని "ఎవ్వడు" అవ్యక్తుడు. ఆ అవ్యక్తరూపుణ్ణి వ్యక్తపరచటానికి 'ఎవ్వడు' అనే మాట ఎన్నో విభక్తులతో రూపుదిద్దుకుంది. అదే ఈ పద్యంలో విశిష్టత.
భావం
ఎవ్వని చేత ఈ జగమంతా సృష్టింపబడినదో, ఎవ్వని లో ఈ జగమంతా లీనమై వుందో, (ఎవ్వనియందు డిందు)ఎవ్వని చేత నాశనం చేయబడుతోందో, ఈ సృష్టికి మూలకారణం ఎవ్వడో, మొదలు, చివర, మధ్య అంతా తానే అయి వున్నవాడు ఎవడో, ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు కోరుచున్నాను.
mamchi praytnam abhinamdanalu
ReplyDelete* రాయైతేనేమిరా దేవుడు - హాయిగా ఉంటాడు జీవుడు - ఉన్నచోటే గోపురం ఉసురు లేని కాపురం - అన్నీఉన్న మహానుభావుడు-- వేటూరి
ReplyDelete* మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు - ఆత్రేయ
* దేవుడికేం హాయిగ ఉన్నాడు-ఈ మానవుడే బాధలుపడుతున్నాడు - శ్రీశ్రీ
* పిల్లలూ దేవుడూ చల్లనివారే
* రాయిరా దేవుడు - తాగితే ఊగడు - మైలవరపు గోపి
* ఎంతో రసికుడు దేవుడు
* మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేశాడు - దాశరధి
ధన్యవాదములు దుర్గేశ్వర్ గారూ,
ReplyDeleteరహంతుల్లా గారూ, మంచి పాటల్ని గుర్తు చేశారు... ధన్యవాదములు
chaala goppa panini chepattaru .meeru chestunna ee prayatnamu bhagavatamupai makkuva vunna telugu telisina vaarandariki ento santhsham kaligistundi. shubahakankshalu.
Delete.................dasari obul das