Sunday, December 13, 2009

శ్రీలు పొంగిన జీవగడ్డయి, పాలు పాఱిన భాగ్యసీమయి

'రాయప్రోలు సుబ్బారావు' గారు వ్రాసిన 'తమ్ముడా' గేయం శేఖర్ కమ్ముల గారి సినిమా 'లీడర్' లో విన్నాను.

అందులో

శ్రీలుపొంగిన జీవగడ్డయి,
పాలుపాఱిన భాగ్యసీమయి,
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా!

అని వుంది. దానిలో నాకు కొన్ని సందేహాలు వున్నాయి. పెద్దలు సందేహనివృత్తి చేయగలరు.

శ్రీ అంటే ఇక్కడ అర్థం ఏమిటి? - సిరిసంపదలనా? అయితే సిరిసంపదలతో తులతూగే 'భాగ్యసీమయి' అనాలి కాని 'జీవగడ్డయి' అని అన్నారు ఎందుకు?

వ్రాలినది అంటే ఏమిటి?


దేశ గర్వము దీప్తి చెందగ
దేశ చరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా!

'దేశమరసిన' అంటే ఏమిటి

పూర్తి పాఠం కోసం తమ్ముడా క్లిక్ చేయండి.  (Internet explorer లో మాత్రమే కనపడుతుంది.)

3 comments:

  1. శ్రీలు - శుభాలు
    వ్రాలినది - వరలినది - విరాజిల్లినది
    అరయు - చూచుకొను (కాపలా కాయు)

    ReplyDelete
  2. సుబ్రహ్మణ్యంగారూ మీకు నా నెనర్లు.

    ReplyDelete
  3. షణ్ముఖన్ గారు,
    మీరెప్పుడో జూలైలో నా బ్లాగులో రాసిన వ్యాఖ్య ఇప్పుడే చూశాను. ఆ టపా, దాణి మీద చర్చా అంతా రెండేళ్ళ నాటి విషయం గనక, మీరడిగిన ప్రశ్నలకి తాజాగా ఒక కొత్త టపా రాస్తాను.
    ధన్యవాదాలు. మీ బ్లాగు ఇప్పుడే గమనించాను. పద్యాల్ని గురించి మంచి కృషి చేస్తున్నారు. అభినందనలు.

    ReplyDelete